Crimejournalist

Feb 24 2024, 07:23

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ చర్యలు




జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

[ Streebuzz news Crime journalist ]


(మొగుళ్ళపల్లి):- మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన కొలువుదీరిన శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొగుళ్లపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ చర్యలు తీసుకుంటున్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చే వాహనదారులకు వెహికల్స్ పార్కింగ్ ఏర్పాటు చేసి, ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చొరవ చూపారు. జాతరలో దొంగల పట్ల ప్రమాదంగా ఉండాలని భక్తులను అప్రమత్తం చేశారు. ఆకతాయిలా భరతం పట్టేందుకు పోలీస్ నిఘాను ఏర్పాటు చేశారు. భక్తుల పట్ల ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ చూపిస్తున్న అభిమానం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Crimejournalist

Feb 23 2024, 09:15

అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు



సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist ]


(వర్గల్) :- ఇండ్ల నిర్మాణాల కోసం వినియోగించే సెంట్రింగ్ బాక్స్ ల అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ను సిద్దిపేట జిల్లా గౌరారం పోలీసులు గురువారం అరెస్టు చేశారు.ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ వర్గల్ కమాన్ వద్ద తనిఖీలు చేస్తుండగా గౌరారం వైపు వస్తున్న అశోక్ లేలాండ్ వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నామని ,వారిని విచారించగా ఇండ్ల నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ బాక్సులు , ఇనుప పైపులను దొంగతనాలు చేశామని మెదక్ లో నాలుగు చోట్ల సిద్దిపేటలో ఏడు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితులు చెప్పడం జరిగిందని అన్నారు. సెంట్రిగ్ బాక్సులు ఇనుప పైపులను సిద్దిపేట జిల్లాలో ఏడు చోట్ల, మెదక్ జిల్లాలో 11 చోట్ల చోరీకి పాల్పడ్డారని చోరీకి పాల్పడ్డ వ్యక్తులు నల్గొండ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని, వీరితోపాటు మరో 17 మంది ఉన్నట్లు విచారణ లో తేలిందని తెలిపారు.

Crimejournalist

Feb 23 2024, 09:03

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి

హైదరాబాద్:

[ Streebuzz news Crime journalist ]

(హైదరాబాద్):- కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజీ మాజి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో కంటోన్మెంట్ సీనియర్ ఎమ్మెల్యే అయిన తన తండ్రి సాయన్న మృతి నుండి ఇంకా కోలుకొక ముందే, ప్రజా సేవలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కంటోన్మెంట్ ప్రజల మన్ననలు పొందిన యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం అత్యంత బాధాకరమన్నారు. ఆమె మరణం కంటోన్మెంట్ ప్రజలకు, బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

Crimejournalist

Feb 23 2024, 08:50

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ - రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు


• అదిలాబాద్ MP కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ అశిస్తుంది •



• సామాజిక కార్యక్రమాలలో ముందున్న ఆత్రం అనసూయ •

[ Streebuzz news Crime journalist]

(అదిలాబాద్ జిల్లా):- గత 33 సంవత్సరాలుగా అదిలాబాద్ జిల్లాలో టీచర్ గా డిప్యూటీ వార్డెన్ గా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తూ దాదాపు వేలాది మంది గిరిజన విద్యార్థి వారి తల్లిదండ్రులలో పరోక్షంగా ప్రత్యేక్షంగా సంబంధాలు కలిగి ముదొల్ బాసర నుండి నిర్మల్, బోథ్, అదిలాబాద్ ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ బెజ్జుర్ వరకు ఇటు జన్నారం వరకు మంచి పేరు అందరితో సన్నిత సంబంధాలు కలిగి ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ గుర్తించి అదిలాబాద్ ఎంపి టికెట్ ఇస్తే గెలిసి శ్రీ రాహుల్ గాంధీ గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ఎంపి గా గెలిసి గిఫ్ట్ గా ఈవ్వడనికి సిద్దమైనట్లు ఆత్రం అనసూయ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి నుంచి మా తాత తండ్రుల నుండి ఇప్పటి వరకు అందరు కాంగ్రెస్ పార్టీకి సంబందించిన వారేనని అన్నారు .కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమే కాకుండా వేయించిన వారు కాబట్టి ఆత్రం అనసూయ ముక్కుసూటిగా ఉంటూ ఎలాంటి తప్పు చేయకుండా అందరికీ మేలు జరగాలి అందరు బాగుండాలి అందులో నేనుండాలి ఆని కోరుకునే మహిళ ఆత్రం అనసూయ. గిరిజన ఆదివాసీ ముద్దు బిడ్డ భర్త తో పాటు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులు అందరు స్థిరపడ్డారు సంపాదించుకోవడానికి కాకుండ రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. •మృతిని కుటుంబానికి ఆర్ధిక సహాయాన్ని అందించి మానవత్వన్ని చాటుకున్న ఆత్రం అనసూయ• •అదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సామాజిక కార్యకర్త ఆత్రం అనసూయ• అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసిన వెనువెంటనే ఆ గ్రామానికి చేరుకుని దహన సంస్కారాలు నిర్వహించాడానికి తన బాధ్యతగా ఆర్ధిక సహాయాన్ని అందించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. పేద వాళ్లకు మరింత మీ సహాయాన్ని అందించి ఆదుకోవాలని అక్కడి ప్రజలు కోరారు.వారితో పాటు మాజి సర్పంచ్ గెడం యశ్వంత్, యూత్ సభ్యులు బీంరావు ,రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 23 2024, 08:04

పట్టుదల ముందు పేదరికం అడ్డు కాదు - బీసీ జిల్లా అధ్యక్షుడు కందూరి అయిలయ్య



సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist ]

(ఉమ్మడి కొండపాక):- చిన్నతనం నుండే అమ్మా నాన్న లేకపొయిన కడు పేదరికాన్ని బరిస్తూ పట్టుదల వదలక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కుకునూర్ పల్లి మండల కేంద్రానికి చెందిన తుప్పటి కర్నాకర్ ను బీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కందూరి అయిలయ్య అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవైపు తినడానికి తిండి లేక పోయినా తమ్ముడు , చెల్లెలిని సాదుకుంటూ వీలు కుదిరినప్పుడ్లా చదువుకొని తన పట్టుదలను వదలలేదన్నారు. సంకల్పం గట్టిగా ఉంటే సదించనిది లేదని కర్నాకర్ నిరూపించారని అన్నారు.ప్రతి కష్టాన్ని అధిగమించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నాకర్ ,నవీన్ ,డాక్టర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 23 2024, 07:54

పట్టుదల ముందు పేదరికం అడ్డు కదు బీసీ జిల్లా అధ్యక్షుడు కందూరి అయిలయ్య



సిద్దిపేట జిల్లా:


(ఉమ్మడి కొండపాక):- చిన్నతనం నుండే అమ్మా నాన్న లేకపొయిన కడు పేదరికాన్ని బరిస్తూ పట్టుదల వదలక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కుకునూర్ పల్లి మండల కేంద్రానికి చెందిన తుప్పటి కర్నాకర్ ను బీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కందూరి అయిలయ్య అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవైపు తినడానికి తిండి లేక పోయినా తమ్ముడు , చెల్లెలిని సాదుకుంటూ వీలు కుదిరినప్పుడ్లా చదువుకొని తన పట్టుదలను వదలలేదన్నారు. సంకల్పం గట్టిగా ఉంటే సదించనిది లేదని కర్నాకర్ నిరూపించారని అన్నారు.ప్రతి కష్టాన్ని అధిగమించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నాకర్ ,నవీన్ ,డాక్టర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 23 2024, 07:38

ప్రజా ప్రభుత్వంలో అందరికి సమన్యాయం జరుగుతుంది - జిల్లా సీనియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్


సిద్దిపేట జిల్లా:


(నారాయణరావుపేట):- మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల ముఖ్య సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిద్దిపేట జిల్లా సినియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నిక అయిన గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు నక్క కాంతయ్య, అధ్యక్షులు బోయిని బాలయ్య, కార్యనిర్వహ అధ్యక్షుడు సారుగు హరికృష్ణ, ఉపాధ్యక్షుడు మాట్ల రాజు, ప్రధాన కార్యదర్శి మోసర్ల భూపతి రెడ్డి, కార్యదర్శులుగా జక్కుల బుచ్చెయ్య, దాకం కనకయ్య గార్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకుని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు..అదే విదంగా జక్కాపూర్ గ్రామంలో ఆనాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా, ఐక్యమత్యంగా ఉందని, అదే ఐక్యమత్యంతో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి, అందరికి అందుబాటులో ఉండాలన్నారు.ఇంకా అనేక సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి, వాటన్నింటిని కూడా ప్రభుత్వ పెద్దల దృష్జికి ఎప్పటికప్పుడు తీసుకపోయి, పరిష్కారం చేసుకునెందుకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్, మండల కిసాన్ సెల్ అధ్యక్షలు రాజేశం గౌడ్, సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, చిన్నకోడూర్ సీనియర్ నాయకులు కనకయ్య, తీగల భాస్కర్, పల్లె పర్శరాములు, నిరుగొండ దేవయ్య,కయ్యాల అంజయ్య, గుండెల్లి వేణు, పల్లె ప్రశాంత్, జక్కుల కనకయ్యా, ఎండి షాదుల్, రఫి, పనుగట్ల రామచంద్రము తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 23 2024, 07:26

భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు




•చలివేంద్రాన్ని ప్రారంబించిన ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు •


జయశంకర్ భూపాలపల్లి జిల్లా:



(మొగుళ్ళపల్లి ):- మండలంలోని ముల్కలపల్లి- మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగు సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఎస్ బి ఐ మొగుళ్లపల్లి బ్రాంచ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ బి ఐ మొగుళ్ళపల్లి బ్రాంచ్ మేనేజర్ ధర్మరాజు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వనదేవతలైన శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా..మంచినీటి సమస్య తలెత్తకుండా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు మంచినీటి సమస్యను తీరుస్తున్న ఎస్ బి ఐ బ్రాంచ్ మేనేజర్ మరియు సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ పక్షాన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ బి ఐ ఫీల్డ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, బ్యాంక్ సిబ్బంది ఓదెలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు, ఎండి రఫీ, యూత్ కాంగ్రెస్ మొగళ్లపల్లి మండల అధ్యక్షులు నీల రాజు కురుమ, కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 22 2024, 08:15

ఇచ్చిన మాటను 24 గంటల్లోపే అమలు చేసిన గజ్వేల్ ఏసిపి బాలాజీ

ధన్యవాదాలు తెలిపిన బార్ అసోసియేషన్ సభ్యులు

సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist ]


(గజ్వేల్ ):- గజ్వేల్ బార్ అసోసియేషన్ సభ్యులు గజ్వేల్ కోర్టు ఎదురుగా ఉన్న రోడ్డులో వాహనాలు వేగంగా వస్తున్నాయని గతంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని గజ్వేల్ ఏసీపీ బాలాజీ కి తెలపగా ఏసిపి బార్ అసోసియేషన్ సభ్యులతో కలసి స్థలాన్ని సందర్శించి స్పీడ్ బ్రేకర్, గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఇచ్చిన మాటను 24 గంటల్లోపే అమలు చేసిన గజ్వేల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ బాలాజీ గారికి గజ్వేల్ బార్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ బార్ అసోసియేషన్ జాయింట సెక్రెటరీ ఎన్నెల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 22 2024, 07:50

పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసిన బేగంపేట నూతన ఎస్ఐ



సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist ]

• బేగంపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రవి కాంత్ రావు •

సిద్దిపేట జిల్లా బేగంపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రవి కాంత్ రావు,మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మేడమ్ గారిని కలసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ ఎస్ఐ.ను అభినందించి శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. రాబోవు ఎంపీ ఎలక్షన్లో సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.